
* కాళేశ్వర దర్శనం సర్వపాపహరణం
ఆకేరున్యూస్, కాళేశ్వరం: దేశంలోనే సరస్వతి పుష్కరాలను తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సరస్వతి పుష్కరాలలో పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి పుష్కర స్నానం ఆచరిస్తుండటంతో కాళేశ్వర తీరం పుణ్యఫల తీరంగా మారింది. పుష్కర స్నానమాచరించిన భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడంతో తెలిసి తెలియక చేసిన సర్వపాపాలు భరించకపోతాయని ప్రగాఢ నమ్మకం. దీంతో ఆరవ రోజు సైతం పలు రాష్ట్రాల నుండి సరస్వతి పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తుల వరద కొనసాగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా జిల్లా కలెక్టర్రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అహర్నిశలు సేవలందిస్తూ భక్తుల మన్ననలను పొందుతుంది.
భక్తుల ఆనందం కోసం
పుష్కర స్నానాలకు వస్తున్న భక్తులు ఆనందంగా గడపడానికి త్రివేణి సంగమంలో స్పీడ్ బోట్లు, అందాలను వీక్షించడానికి హెలిక్యాప్టర్ సదుపాయం ఎగ్జిబిషన్ లాంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. అలాగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో ఎప్పటికప్పుడు జికలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లు క్షేత్ర ప్రదర్శన చేస్తూ సమస్యలు ఉన్నచోట వాకీటాకీ ద్వారా అధికారులకు సూచనలిస్తూ భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా తమ పర్యవేక్షణలో సరస్వతి పుష్కరాలను ముందుకు కొనసాగిస్తున్నారు.
………………………………………..