
* గవర్నర్ ను కలిసిన మంత్రులు,ఎమ్మెల్యేలు
* బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, సీపీఐ నారాయణ,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
*బీజేపీ ఎమ్మెల్యేల గైర్హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు చేరింది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం కోసం కలిసికట్టుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు వినతి పత్రం సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, సీపీఐ నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిశారు. గర్నవర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీకి బీజేపీ నేతలు ఎవరూ హాజరుకాలేదు.అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. న్యాయపరంగా అన్ని విషయాలను తెలుసుకునే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు. అఖిల పక్ష నేతలతో సోమవారం గవర్నర్ను కలిసి, ఈ విషయంలో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఉన్న విషయం వివరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు చెందిన మేధావులు, ఉద్యోగులు, విద్యార్థలు తమ ప్రయత్నాన్ని గుర్తించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
……………………………………………….