
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల తరపు వాదనల అనంతరం.. ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఫ్వీు వాదనలు వినిపించారు. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. నామినేషన్ల వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. కాగా.. ‘‘బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని.. బీసీ ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఫ్వీు వాదనలు వినిపిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య, వీ హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు. వేశారు. ఆయా పిటిషన్లను సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లను పెంచుకునేందుకు ప్రభుత్వానికి ఉన్నా 50శాతానికి మించకూడదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
…………………………………………….