* తమిళనాడు తరహా లో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం
*42 కాదు 50% కోసం పోరాటం ఉదృతం చేస్తాం
*మహాజన సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బిసిల కు కేవలం స్థానికసంస్థలు ,42% రిజర్వేషన్ కాకుండా అన్ని రంగాల్లో 50శాతానికి పైగా వాటా దక్కాలని మహాజన సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారుగురువారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…అన్ని రంగాల్లో bc లకు 50% రిజర్వేషన్ల సాధనే లక్ష్యం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.ఇంద్ర సహాని కేసు లో 50% రిజర్వేషన్ల పరిమితి అనేది ఒక కుట్ర అని కోర్టు కేవలం సూచన మాత్రమే చేసిందని గుర్తు చేశారు.. తెలంగాణా హైకోర్టు లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కావాలనే స్టే వచ్చే విదంగా కుట్రలు చేశారన్నారు.ఎస్సీ వర్గీకరణ కు 7 గురు జడ్జి ల ధర్మాసం వేసి 2004 తీర్పును రివ్యూ చేసి మాదిగలకు న్యాయం చేసినట్టు 11 మంది జడ్జి ల ధర్మాసం వేసి 50% రిజర్వేషన్ల పరిమితి పైనా సుప్రీంకోర్టు లో రివ్యూ జరగాలన్నారు..దేశం లో ఏది చేయాలన్న కేంద్రం చేతిలోనే ఉందని. రాజ్యాంగ సవరణ , ఆర్టికల్స్ మార్చాలన్న , 9th షెడ్యూల్ లో పెట్టాలన్న , 11 మంది జడ్జిలతో ధర్మాసనం వేయాలన్న ఆది కేంద్రమే చేయాలన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులకు , బీసీ ఎంపీ లకు నోరెత్తే ధైర్యం లేకే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో సామాజిక పరిస్థితి లను వివరించే ప్రయత్నం కూడా చేయలేని దద్దమ్మలుగా మిగిలిపోతారని విమర్శించారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ కి తీసుకెళ్లి బీసీ ల ఆకాంక్షను చాటే ప్రయత్నం బీసీ ఎంపీలు , కేంద్ర మంత్రులు చేయరా ? అని ప్రశ్నించారు. ఇదే అంశంలో తమిళనాడు ప్రభుత్వానికి సాధ్యమయ్యి మనకెందుకు కావడం లేదు అని పరిశీలిస్తే నాయకత్వ చిత్త శుద్ధి లోపం తప్ప మరేం కనిపించడం లేదన్నారు.
రాజకీయ పార్టీ కి కొమ్ముకాసే వాళ్ళు జాక్ ని నడిపిస్తారా ?
ఈనెల 18న జరిగిన బిసి బంద్ విజయవంతమయ్యిందని, కానీ నాయకులే విఫలమయ్యారని ప్రదీప్ గౌడ్ విమర్శించారు.ఆర్ . కృష్ణయ్య , బీసీ – జాక్ ఛైర్మెన్ గా అనర్హుడని ఆయన త్యాగాన్ని గుర్తించి వివిధ అగ్రకుల పార్టీ లు పదవులు కట్టబెట్టారని రాజకీయ పార్టీ కి కొమ్ముకాసే వాళ్ళు జాక్ ని నడిపిస్తారా ? అని ప్రశ్నించారు. జాక్ తో ఎలాంటి స్వార్థ రాజకీయాలు లేకుండా పనిచేస్తుందనే విశ్వాసం ప్రజలకు ఎలా కల్పిస్తారు ? దుయ్యబట్టారు. కావున అన్ని సంఘాలు, మేధావులు, పార్టీలు అన్నింటిని కలుపుకుని పనిచేయాలని సూచించారు. ఈ జాక్ స్థానిక సంస్థలకోసమో , తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ల లక్ష్యంగా పోరాటాలు చేయాలని ప్రదీప్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మహాజన సేన జాతీయ కో ఆర్డినేటర్ షణ్ముఖ రావు, మహిళా కన్వీనర్ మంగమ్మ , యువ సేన నాయకులు సాదిరం ప్రశాంత్, అరుణ్ , అనిల్ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.
