
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల బి సి నాయకులు కార్యకర్తలు ఒక్కటి కావాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చీప్ కోఆర్డినేటర్ డాక్టర్ కే వీరస్వామి పిలుపునిచ్చారు.ఈమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనా ఆయన మాట్లాడుతూ బీసీలు రాజకీయాలకతీతంగా ఒకటి కావలసిన అవసరం ఏర్పడినదని అన్నారు .ప్రధాన రాజకీయ పార్టీల కుట్ర వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆరోపించారు .18వ తేదీన జరిగే బంధు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంధు స్వచ్ఛందంగా పాటించాలని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఏ తిరుపతి మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు బయటకు వచ్చి 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించవలసిందిగా ఆయన బీసీలకు పిలుపునిచ్చారు. ఎం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య మాట్లాడుతూ బీసీల అస్తిత్వం కోసం మా పార్టీ ఎప్పుడూ కష్టపడి పని చేస్తుందని ఆయన అన్నారు. సిపిఐ పార్టీ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ మా పార్టీ బీసీల కోసం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని అన్నారు.ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి నెమలి నరసయ్య మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బీసీల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని బీసీల ఉద్యమంలో తాము తప్పకుండా పాల్గొంటామని అన్నారు.సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు యాశ బోయిన సాంబయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యమాన్ని మరో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు కొనసాగించాలని ఆయన అన్నారు. రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డేపల్లి సారంగపాణి మాట్లాడుతూ మా రజక సంఘం బీసీల ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు ఉపేంద్ర గౌడ్ సామాజిక ఉద్యమ నాయకులు దేవేందర్ మాట్లాడుతూ తాము బిసి ఉద్యమంలో తప్పకుండా పాల్గొంటామని అన్నారు సాగర్ ముఖేష్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మా పార్టీ బీసీల కోసం ఎల్లప్పుడు కృషి చేస్తుందని మేము ఉద్యమంలో పాల్గొంటామని అన్నారు .సిపిఎం పార్టీ ములుగు జిల్లా నాయకులు రత్నం ప్రవీణ్ బోడ నర్సింహం మాట్లాడుతూ మా సిపిఎం పార్టీ బీసీల కోసం ప్రత్యేక ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నామన అన్నారు. చక్రపాణి బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీల కోసం యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తురక వీరబాబు మాట్లాడుతూ బీసీలు మరో జిల్లా ఉద్యమంలో ఏ విధంగా చేశామో ఆ విధంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని వీరబాబు పిలుపునిచ్చారు. బీసీలకు మనం ఎంత మందిమో మనకంత వాట కోసం ఉద్యమాలు నిర్వహించాలని ఆయన ఈరోజు జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు .
అనంతరం బీసీ జేఏసీ కమిటీ ఎన్నుకోవడం జరిగినది
బీసీ జేఏసీ అధ్యక్షులుగా ముంజల బిక్షపతి గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ గా తోటకూరి శ్రీకాంత్ గౌడ్ ఉపాధ్యక్షులుగా తురక వీరబాబు కార్యదర్శిగా చక్రపాణి 21 మందితో కమిటీ ఎన్నుకున్నారు.ముత్యాల రాజు బీసీ సాధన సమితి నాయకులు సర్దార్ పాషా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు .బీసీ అనుబంధంగా ఎస్సీ ఎస్టీ కమిటీ కన్వీనర్ గా నెమలి నరసయ్య చంటి భద్రయ్య సాగర్ శ్యామల నాయక్ తదితరులను నియమించడం జరిగినది యాదవ మహాసభ కోరే రవి యాదవ్ సాగర్ యాదవ్ దెబ్బగట్ల లక్ష్మయ్య గౌడ సంఘ నాయకులు రెడ్డి శ్రీనివాస్ బీసీ నాయకులు లాగా శ్రీనివాస్ అడ్వకేట్ యూనియన్ జిలకర వేణు వారాల సంఘం నాయకులు గుండె మీది వెంకటేశ్వర్లు కళాకారుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు వడ్ద్యాల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….