
* అధికారులకుయ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అలాగే అత్యవసర సేవల విషయంలో అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అత్యవసర సేవలు 24 గంటలు అందుబాటులో ఉండాలని ప్రజలకు ఏలోటూ రాకుండా వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్ర దామోదర రాజ నర్సింహ ( DAMODARA RAJA NARSIMHA) వైద్యులను ఆదేశించారు. వర్షాల ఉధృతి తగ్గిపోయేవరకు వైద్యులు సెలవులు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ నిర్వహించారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు(SUPERITEDENTED) ఆర్ఎంవోలు, (RMO)మెడికల్ ఆఫీసర్లు,(MEDICAL OFFICERS) డాక్టర్లు,(DOCTORS) సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. గర్భిణులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు.అలాగే హాస్పిటళ్లలో నిరంతరం కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనరేటర్లను రెడీగా ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి ప్రభుత్వానికి వెంటవెంటనే సమాచారం అందించాలని మంత్రి దామోదర రాజనర్పింహ ఆదేశించారు.
……………………………………….