
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
* అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు అప్పమత్తంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KOMATIREDDY VENKATREDDY) అన్నారు.రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల చాలా చోట్ల రోడ్లు వంతెనలు రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. శనివారం రోజు ఆయన ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ , ఇతర ఉన్నతాధికారులతో వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కాజ్వేల వద్ద,కల్వర్టుల వద్ద ప్రత్యక్షంగా పరిశీలించాలని అధికారులను ఇంజనీర్లను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలన్నారు.పోలీస్ శాఖ తో పాటు విద్యుత్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ నీటిపారుదల శాఖలతో సమన్వయం ఏర్పరుచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
……………………………………….