
* ములుగు జిల్లా ప్రజలకు మంత్రి సీతక్క సూచన
* మేడారం , జంపన్నవాగు , తుమ్మల వాగుల వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి
ఆకేరు న్యూస్, ములుగు: తాడ్వాయి మండలం , మేడారం జంపన్నవాగు, ఊరట్టం తూముల వాగు వరద ప్రవాహాన్ని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరిశిలించారు.మంత్రీ సీతక్క మాట్లాడుతూ మరో రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నందున ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇల్లును వదిలేసి దగ్గరలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. రైతులు , ప్రజలు , చాపల వేటకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బందీ అయిన స్థానిక మండల అధికారులకు , కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు , జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ గారు , స్థానిక ఎమ్మార్వో , మండల అధికారులు , తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజు , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సర్ ఖాన్ , సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్ , మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు గౌడ్ , మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , గ్రామ సెక్రటరీ , గ్రామ కమిటీ అధ్యక్షులు కోటే నరసింహులు , యువజన నాయకులు గంట సాయి రెడ్డి , చర్ప నేతాజీ , గజ్జల నరేందర్ , జిల్లా , మండల. నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
…………………………………..