* అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు
* సైబర్ నేరాలపై సీపీ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ నేరాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. అమాయకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకొని మోసం చేస్తూ లక్షలు కొల్లగొడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఇవాళ(ఆదివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు. రకరకాల యాప్ లను సృష్టిస్తూ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుందామనుకుంటే సహించేది లేదన్నారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని అన్నారు . డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామన్నారు .. ఆయా యాప్‌లలో పెట్టుబడులు పెట్టే ముందు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీపీ సజ్జనార్.ప్రజలు ప్రధానంగా డిజిటల్ నేరాలు, సైబర్ ఫ్రాడ్ల ద్వారా మోసపోతున్నారని తెలిపారు. మరికొంతమంది ఏపీకే ఫైల్స్ వల్ల కూడా నష్టపోతున్నారని తెలిపారు. ఏ ఫ్రాడ్ జరిగిన వెంటనే 1930 నెంబర్‌కి కాల్ చేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు కోటి రూపాయలు వరకు సైబర్ కేటుగాళ్లు దోచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఏడాదికి రూ.400 కోట్ల వరకు రాష్ట్ర ప్రజల నుంచి సైబర్ కేటుగాళ్లు దోచుకుంటున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
…………………………………………….
