
* హైదరాబాద్ కు వరద ముంపు
* తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్
* ఐదు రోజుల పాటు వర్షాలు
* వాతావరణం కేంద్రం డైరెక్టర్ నాగరత్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని వాతావరణ పరిస్థితులపై వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) డైరెక్టర్ నాగరత్న పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. తీవ్రత దృష్ట్యా ఈరోజు, రేపు తెలంగాణ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. సెంట్రల్ జిల్లాలైన సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షపాతాలు నమోదవుతాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. హనుమకొండ, జనగామ, వరంగల్ (Warangal) జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దిగువన ఉన్న దక్షిణ జిల్లాలకు ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
……………………………………………..