* అధికారులకు కలెక్టర్ దివాకర సూచన
ఆకేరు న్యూస్ ములుగుః ప్రస్తుతం వర్షాకాలం లో సంభవించే విపత్తులలో ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టుటకు సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ దివాకర కోరారు. మంగళవారం జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం (ఎన్డీఆర్ఎఫ్) జిల్లా కు చేరుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరినది, జంపన్న వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అధికారుకు సూచించారు.జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు, గోదావరి నది, జంపన్నవాగు నీటి ప్రవాహం గతంలో జరిగిన సంఘటనల గురించి (ఎన్డీఆర్ఎఫ్) బృందం నకు వివరించారు. గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాలు ఊరటం, నార్లాపూర్, మేడారం నీటి ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి, అకాల వర్షం, విపత్తులలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం ను కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం నకు కావలసిన అన్ని ఏర్పాట్లను సమకూర్చాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి కి సూచించారు.
……………………………………………
