
* సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆకేరు న్యూస్, ములుగు:ప్రస్తుత సీజన్ లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సిబ్బంది వైద్యులు నిరంతరం అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని కీటక జనీత నియంత్రణ అధికారి జాయింట్ డైరెక్టర్ అమర్ సింగ్ సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలో ని వైద్య శాలను అకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , వైద్యఆరోగ్య సిబ్బంది విధి నిర్వహణనలో అలసత్వం వహించకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సమయపాలన పాటించాలని తెలిపారు. అనంతరం హాస్పటలోఉన్న అన్ని వార్డులను పరిశీలించి, వైద్య సేవలు పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలతీరుని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల రక్త నిల్వలను నిల్వ ఉంచుకోవాలని, డ్రగ్ స్టోర్ లో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు .మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వర్షాకాల వ్యాధుల నివారణకు సంబంధించిన మందులను సమకూర్చుకోవాలన్నారు. జ్వరం ఉన్న ప్రతి రోగికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని, టీ హబ్బులో అన్ని రకాల రక్త పరీక్షలను చేసి వాటి రిపోర్టులను సరి అయిన టైంలో అన్ని హాస్పిటలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ చంద్రశేఖర్, హాస్పిటల్ అడిషనల్ డెరైక్టర్ గఫర్ టీ _హబ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ మొదలగు వారు పాల్గొన్నారు.
……………………………………………..