
* అటవీశాఖ అధికారుల ప్రకటన
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెద్దపులి (Tiger) తిరుగుతోందని అటవీశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికంగా కలకలం రేగుతోంది. మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో (Trap Camera) పెద్దపులి జాడలు కనిపించినట్లు చెబుతున్నారు. దానికి సుమారుగా రెండేళ్ల వయసు ఉంటుందని గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని వెల్లడించారు. ఇదిలాఉంటే.. గత గురువారం బోథ్ అటవీ ప్రాంతంలో ఓ దూడపై పెద్దపులి దాడి చేసింది. అప్పటి నుంచీ అధికారులు దాని జాడ కనిపెట్టే పనిలో ఉన్నారు.
………………………………………………….