విద్యార్థిని స్కూలుకు పంపడం లేదని ధర్నా
ఆకేరు న్యూస్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలుకు పంపండంలేదని వారి ఇంటిముందు స్కూల్ టీచర్లు, పిల్లలు నిరసనకు దిగారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి దాదాపు వారం రోజులుగా వెళ్లడంలేదు. దీనిపై టీచర్లు తల్లిదండ్రులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాలుడి ఇంటి వద్దకు వెళ్లి బైఠాయించారు. దీంతో సోమవారం నుండి బాలుడిని తప్పకుండా పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు.
……………………………….
