ఆకేరు న్యూస్, ములుగు: గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక స్వతంత్ర సమరయోధుడు బిర్సాముండా150వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో ని తాడువాయి మండలంకాల్వపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్వీనర్ ఆలం శ్రీను మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక మహనీయుు గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక, స్వాతంత్ర్య సమరయోధుడు, భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు జరుపుకోవడం హర్షించదగినదని అన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 15న మనం జరుపుకునే ఈ బిర్సా ముండా జయంతిని భారత ప్రభుత్వం జన జాతీయ గౌరవ్ దివస్ (గిరిజన గౌరవ దినోత్సవం)గా ప్రకటించి, గిరిజన సమాజం దేశానికి చేసిన గొప్ప సేవలను, త్యాగాలను స్మరించుకుంటోందని ఆయన వివరించారు. ఆయన సేవలను ఆశయాలను యువతకు అవగా హన కల్పించారు
గిరిజన తెగలన్నింటినీ ఏకం చేసి, తమ హక్కుల కోసం పోరాడేలా చేయడంలో ఆయన చూపిన నాయకత్వం, ఐక్యత పూర్తి రగిలించిందని వివరించారు. భగవాన్ బిర్సా ముండా మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో అడవి బిడ్డలు చేసిన త్యాగానికి, పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం. ఆయన వారసత్వాన్ని మనం గౌరవించాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. జన జాతీయ గౌరవ్ దివస్ బిర్సా ముండా చూపిన ధైర్యం, సత్యం, న్యాయం అనే మార్గంలో మనం కూడా నడుస్తామని ప్రతిన బూనుదామన్నారు. ఈ కార్యక్రమంలో తుడు0దెబ్బ జిల్లా డివిజన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల జగన్ కళాబృందం సభ్యులు గ్రామ పెద్దలు సిద్ధబోయిన నరసింగరావు, తేజమూర్తి ,కొప్పుల కృష్ణారావు, యాలం రవి, రవి ,రమేష్, ఎల్లాస్వామి, మడప దేవయ్య యూత్ సభ్యులు కుడుముల రాజు, అల్లెం సతీష్ ,స్వామి, సమ్మయ్య, నరేష్ మహిళా సంఘాలు కొప్పుల స్వాతి ,హేమలత లు తదితరులు పాల్గోన్నారు.
……………………………………………………
