
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, జనగామ: రైతుల భూ వివాదాల పరిష్కారానికి భూ భారతి చట్టం వచ్చిందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధరణిలోని లోపాలను భూ భారతి ద్వారా సవరించవచ్చ న్నారు. ధరణిలో పేర్లు తప్పు పడినా.. ఏ రకమైన సమస్య ఉన్నా సవరించుకునే అవకాశం లేదన్నారు. సాదాబైనామాలకు కూడా ధరణిలో పరిష్కారం లభించలేదన్నారు. భూ భారతిలో సమస్యలకు పరిష్కారం ఉంది.. అధికారులు మనసుపెట్టి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.రైతులకు బ్రహ్మాండంగా అవగాహన ఉంది కానీ అధికారులనే ట్రైన్ చేయాలని ఎమ్మెల్యే కడియం అన్నారు. రైతులకు బెటర్ సర్వీసెస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ సమస్య పరిష్కారం కాదని తిరిగి పంపించవద్దన్నారు. ఒకప్పుడు కలెక్టర్ మాట అంటే సొల్యూషన్ వచ్చేది… సీఎం కంటే పవర్ ఫుల్ ఉండేది..ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా డైల్యూట్ అయిందన్నారు. భూ భారతి ద్వారా సమస్యలు తీరే అవకాశం ఉండడంతో రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
………………………………….