Chityala Police Station Inspection
* ఫిర్యాదులపై వెంటనే ఆన్లైన్ నమోదు & రౌడీషీటర్లపై కఠిన నిఘా
ఆకేరు న్యూస్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖలో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. వార్షిక తనిఖీల్లో (Annual Inspection) భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మంగళవారం చిట్యాల సర్కిల్ కార్యాలయం మరియు చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీకి సిబ్బంది ఘనంగా గౌరవ వందనం (Guard of Honour) సమర్పించారు. అనంతరం ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గారు స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇచ్చారు.
* రికార్డులు, సీసీ కెమెరాలు& CCTNS నవీకరణపై సమీక్ష..
ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది విధి నిర్వహణ తీరును ఎస్పీ నిశితంగా పరిశీలించారు. ప్రధానంగా పెండింగ్ కేసుల పురోగతి, CCTNS (Crime and Criminal Tracking Network & Systems) డేటా నమోదు, బ్లూ కోల్ట్ (Blue Colts) వాహన నిఘా మరియు స్పందన వేగంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
అలాగే, స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల పనితీరును సమీక్షించిన ఎస్పీ, ప్రతి సీసీ కెమెరా 24×7 పని చేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఏవైనా సాంకేతిక లోపాలు లేదా మరమ్మతులు ఉంటే వెంటనే వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు.
* ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రధాన ఆదేశాలు..
రిసెప్షన్‌కు వచ్చే ప్రతి బాధితుడు/ఫిర్యాదుదారు నిరాశతో వెళ్లకూడదు. ఫిర్యాదు అందిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, కేసు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు CCTNS పోర్టల్‌లో నవీకరించాలి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రౌడీ షీటర్లు మరియు అనుమానితులపై నిరంతర నిఘా కొనసాగించాలి.
* స్నేహపూర్వక పోలీసింగ్..
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, నిస్పాక్షికంగా, పారదర్శకంగా మరియు స్నేహపూర్వకంగా సేవలందించి పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలి.
ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్, సంబంధిత ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
