* సమీప బంధువులే నిందితులు
* భూపాలపల్లి జిల్లాలో దారుణం
ఆకేరు న్యూస్, భూపాపలపల్లి : కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ యువకులు ఎనిమిదేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిదిలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిందితులిద్దరి పై ఫోక్సో కేసు నమోదు చేశారు . వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేగొండ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్ కుమార్ కథనం ప్రకారం .. రెండవ తరగతి చదువుతున్న ఆ బాలిక ఆదివారం సెలవుదినం కావడంతో పాఠశాలకు వెళ్ళలేదు. అమ్మా, నాన్నలు వ్యవసాయ పనులకు వెళ్ళారు. ఇంటికి సమీపంలో పిల్లలతో ఆడుకుంటుండగా శ్రీకాంత్, గణేశ్ అనే యువకులు ఆకస్మాత్తుగా వచ్చి బాలిక నోరు మూసి ఎత్తుకెళ్లారు. సమీపంలోని గదిలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కారని బంధువులు చెబుతున్నారు. బాధితురాలితో ఆడుకుంటున్న పిల్లలు కొందరు గ్రామంలో నే ఉన్న బాలిక బంధువుకు సమాచారం చేరవేశారు. హుటా హుటిన ఆయన అక్కడకు చేరుకునేలోపే దారుణం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని బాలిక బంధువులు అంటున్నారు.
* ఎప్పుటి నుంచే కన్నేసి..
సమీప బంధువులు, ఇంటి పరిసరాల్లోనే ఉండే వారు కావడంతో బాలిక పై ఆ దుండగులిద్దరు ఎప్పిటి నుంచో కన్నేశారని తెలుస్తోంది. ఎప్పుడూ మత్తులో జోగుతుండే ఆ ఇద్దరు చాలా రోజులుగా ఆ బాలికను వెంటాడుతున్నట్టు అర్థమవుతోందని గ్రామస్తులు అంటున్నారు. ఎవరిని నమ్మలేని దారుణమైన పరిస్థితులు వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణ రావు , ఇతర రాజకీయ పార్టీల నేతలు బాధిత బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు.
——————————–
