
* స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా
ఆకేరు న్యూస్, స్పోర్స్ట్ డెస్క్ : ఐపీఎల్ 2025లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య(HARDIK PANDYA)కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్‌కు దూరమైన పాండ్య గుజరాత్ మ్యాచ్(GUJARATH MATCH)కు నాయకత్వం వహించాడు. గత సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ కు నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా పాండ్య మారలేదు. గుజరాత్ మ్యాచ్లో్నూ అదే జరిగింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబయి కెప్టెన్ హార్దిక్ కు జరిమానా విధించింది. రూ.12 లక్షలు జరిమానా విధిస్తూ ఐపీఎల్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్(SLOW OVER RATE) కారణంగా హార్దిక్‌కు ఈ జరిమానా విధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో 12 లక్షల జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్ పాండ్య మాత్రమే.
………………………………………….