* రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పెద్దపులి..
ఆకేరున్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలో పెద్ద పులులు కలకలం సృష్టిస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద పులులు సంచరిస్తున్నాయి. పులుల జాడ తెలుసుకునేందుకు ఆయా జిల్లాల పరిధిలోని అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం సృష్టించింది. పట్టపగలే రైలు పట్టాలు దాటుతూ ఓ పెద్ద పులి కెమెరాకు చిక్కింది. రైల్వే స్టేషన్కు సమీపంలోనే పులి సంచారంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
………………………………………