* తనను కాదని పెళ్ళి చేసుకుంటోందని ఘాతుకం
* బీహార్ లో దారుణం
ఆకేరు న్యూస్ , డెస్క్ : బీహార్లో దారుణం జరిగింది. ఆర్ది కుమారి అనే పెళ్ళి కూతురుపై దీన్ బంధు అనే యువకుడు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బీహార్లోని బక్సర్ జిల్లా చౌసా అనే ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పెళ్ళి వేడుకలో దండల మార్పిడి జరుగుతుండగా ఆకస్మాత్తుగా స్టేజీ మీదకు చేరుకున్న యువకుడు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విని అక్కడ ఏం జరిగిందో తేరుకునే లోపే అక్కడి నుంచి యువకుడు పరారయ్యాడు. వెంటనే ఆ యువతిని సమీప ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
* పెళ్ళి మంటపంలో రక్తపు ధారలు
అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగుతున్న ఆ వేడుకలో ఒక్కసారిగా విషాదం అలుముకున్నది. పెళ్ళి తలంబ్రాలతో జరగాల్సిన వేడుక రక్తంతో తడిసిపోయింది. పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు పరస్పరం పూల మాలలు మార్చుకునే క్రమంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. పెళ్ళి కూతురు దగ్గరకు చేరుకుంటున్న దీన్ బంధు ను చూసి పెళ్ళికి వచ్చిన అతిథుల్లో ఒకరుగా అందరూ భావించారు. దగ్గర కు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపారు. శబ్ధం విన్న అతిథులు బాణా సంచా పేళుల్లు కావచ్చనుకున్నామంటున్నారు. పెళ్ళి కూతురు రక్తపు ధారలతో పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా అటువైపు కదిలారు. నిందితుడు దీన్ బంధు పెళ్లి కూతురు ఆర్త కుమారి ఉండే కాలనీలో ఉంటాడంటున్నారు. రెండేళ్ళుగా ఆర్తిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడంటున్నారు. పెళ్ళి సంబంధం కుదిరిన తర్వాత కూడా వరుడి కుటుంబ సభ్యులను పెళ్లి ఆపేయాలని బెదిరించినట్లు బంధువులు చెబతున్నారు..
* ప్రేమ వ్యవహారమే కారణమా..?
నిందితుడు పెళ్ళి కూతురు నివాసం ఉండే కాలనీలోనే ఉంటాడంటున్నారు. ఇద్దరు ప్రేమ వ్యవహారం ఉందంటున్నారు. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక పోయిన యువకుడు కాల్పులకు తెగబడ్డాడని అంటున్నారు.కాగా సమాచారం అందిన వెంటనే, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివాహ వేదిక నుండి ఆధారాలు సేకరించి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.
—————
