
ఆకేరు న్యూస్, భద్రాచాలం : బైక్ పై వెళ్తూ షార్ట్ సర్క్యూట్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెన్నలబైలు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంభునిగూడెం పంచాయతీ వెన్నలబైలు గ్రామానికి చెందిన పర్సిక రాజు (35) ఉదయం పొలానికి బైక్ పె వెళ్తుండగా విద్యుత్ హై టెన్షన్ తీగలు తగిలి బైక్ ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. బైక్ పై వెళ్తున్న రాజు మంటల్లో సజీవదహనం అయ్యాడు. కళ్ల ముందు యువకుడు కాలిపోతున్న దృష్యాన్ని చూసిన గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
……………………………………………