![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-39.jpg)
* ఏపీలో ఓ వ్యక్తికి నిర్ధారణ
ఆకేరు న్యూస్, విజయవాడ : బర్డ్ ఫ్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం కుదేలైంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ప్రధానంగా ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కోస్తాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, వేల్పూరులోనూ ఓ కోళ్లను నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా.. బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అధికారులు అగ్రహారం పరిధిలోని రెడ్‌జోన్(Redzone)గా ప్రకటించారు. మరో వైపు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిన ప్రాంతంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడి నుంచి ఇక్కడకు కోళ్ల రవాణాను నిలిపేసింది. ఇదిలాఉండగా తాజాగా ఓ మనిషికి బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ సోకడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
…………………………………..