
* ఫిలిప్పీన్స్లో తెలంగాణ వైద్య విద్యార్థిని మృతి
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : తెలంగాణ(Telangana)కు చెందిన వైద్య విద్యార్థిని పుట్టిన రోజు నాడే ఫిలిప్పీన్స్లో(Philippines) మృతి చెందడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్చెరు మండలం ఇంద్రేషం గ్రామానికి చెందిన చింత అమృత్ రావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె చింత స్నిగ్ధ ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన స్నిగ్ధ పుట్టిన రోజే ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చనిపోవడం కలకలం రేపింది. ఆమె మృతి వార్త విని, ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
…………………………………………..