* ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం ఎదురయింది. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం బస్సును టిప్పర్ ఢీకొట్టిఘోర రోడ్డ ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఈ ఘటనలోఇప్పటి వరకు 19 మంది మరణించి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెల్సింది. ఈ నేపధ్యంలో ఘటనా స్థలానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైది. రోడ్డు సరిగా లేనందుకే రోడ్డు ప్రమాదం జరిగిందంటూ భాధితులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాధితుల ఆగ్రహాన్ని చవి చూసిన ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక అక్కడనుంచి వెళ్లిపోయారు.
…………………………………………
