
* బీసీలపై రెండు పార్టీలకు ప్రేమ లేదు
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీసీల పై బీజేపీ బీ ఆర్ ఎస్ పార్టీలు రెండూ ఒకటే అభిప్రాయంతో ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యద\ర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ రెండు పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయని విమర్శించారు. బిల్లు సందర్భంగా అసెంబ్లీలో మత్తతు ఇచ్చాం అని చెప్పుకుంటున్న ఆ రెండు పార్టీలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేంద్రాని ఉందని కానీ కేంద్రానికి బీజీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదని కూనం నేని విమర్శించారు. 9 వ షెడ్యూల్ లో పెట్టడం ద్వారా ప్రత్యేక పరిస్థితుల్లో తమిళనాడులో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేశారని గుర్తు చేశారు. బీసీ బిల్లుపై ఆమోదం పొందేలా రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్ని పార్టీల నాయకులు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేందుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తడి తేవాలని ఆఖిలపక్షం ఆధ్వర్యంలి ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
…………………………………