
ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ హవా
* సేవ్ హైదరాబాద్ అంటూ నినాదాలు
* కరెంట్ తీగల మరణాల నేపథ్యంలో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవల హైదరాబాద్లో విద్యుత్ తీగల తగిలి వ్యక్తుల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అశంపై సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నాయకులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపు నిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరు జిల్లాల భారతీయ జనతా పార్టీ నాయకులు సచివాలయం వద్దకు చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి వారిని అరెస్టు చేశారు. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లను, నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
……………………………………