BJP foundation day Kamalapur
ఆకేరు న్యూస్, కమలాపూర్:
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని కమలాపూర్, ఉప్పల్,భీంపల్లి,శనిగరం, మాదన్నపేట,గూనిపర్తి గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కమలాపూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ పార్టీ జెండాను ఎగురవేసి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి అర్హులైన పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతోనే బిజెపి పార్టీ రూపుదిద్దుకుందని , ఎంతోమంది నాయకులు, కార్యకర్తల ప్రాణ త్యాగాల పునాదులపై నిర్మితమైన బీజేపీ, నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమలువుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దీనివల్ల పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా పెరుగుతోందని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు.
మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నాయకులు తోట సురేష్,బండి కళాధర్, బుర్ర కరుణాకర్, భూపతి ప్రవీణ్, తుమ్మ శోభన్ బాబు, కనుకుంట్ల అరవింద్, ఇనుగాల రత్నాకర్, జెట్టి సారంగపాణి, మేడిపల్లి రాజు,భోగి బిక్షపతి, చలికి శ్రీనివాస్, మౌటం రమేష్ బాబు, పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, జెర్రిపోతుల రాజేందర్, బండి సంపత్, అకినపల్లి రవీందర్ గుర్రం సురేష్ పుస్కూరి రాంబాబు రావుల ఆకాష్, పెసరబోయిన విజయకుమార్, మార్గం చైతన్య,జై. లక్ష్మణ్,నరిగే ఓదెలు, తూర్పాటి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
