* రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది
* జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సే
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణను బీజేపీ పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సే అని విమర్శించారు. పాలనా వైఫల్యం.. కాంగ్రెస్ (CONGRESS) నిర్లక్షం ప్రజలకు శాపంగా మారిందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ (BJP) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వెల్లడించారు. తాగు, సాగు నీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ (BRS) ఉన్నపుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చేరినవారిలో మాజీ ఎంపీటీసీ దేశీటి పటేల్, రవి కుమార్, మాజీ సర్పంచ్ తుకారాం, భాస్కరం, సంగశీటి, సంజీవ్, అమృత్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
………………………………………….
