
* రేవంత్ తో రాహుల్ కు ముప్పే
* బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను వంచించాయి
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ రక్షిస్తోందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.సోమవారం తెలంగాణ భవనలో ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. మోదీ, రేవంత్ లు ఇద్దరూ తోడు దొంగలని బడే భాయ్ చోటే భాయ్ లాంటి వారని అన్నారు. భవిష్యత్ లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోసం చేస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ఆటలో అరటిపండులా తయారయ్యాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని , పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తాఅని మోదీ దేశ ప్రజలను మోసం చేస్తే ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ.. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రేవంత్ చెప్పి మాట తప్పారని విమర్శించారు. కేంద్రంలో రేవంత్ రెడ్డి బావమరిదిని బీజేపీ కాపాడితే తెలంగాణలో బీజేపీ ఎంపీకి రోడ్డు కాంట్రా క్ట్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ నేతలు గోదావరి నీళ్లను కింద ఉన్న ఆంధ్రకు,తమిళనాడుకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు, తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్కు 8 ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వారు చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు కిలో మీటర్ల మేర క్యూలైన్లలో నిల్చునే దుస్థితి ఉందని కేటీఆర్ అన్నారు.
…………………………………