
* ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : బీజేపీ(BJP) నాయకులు బీసీ(BC)ల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నంలో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడింది. తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన బీసీల రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలు ఉన్నారో లేదో తెలియకుండా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారని కవిత (MLC KAVITHA) అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (BANDI SANJAY) చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ముస్లింలకే 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికే తెలంగాణ ప్రభుత్వం బీసి రిజర్వేషన్ల బిల్లును తయారుచేసిందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కవిత మండి పడ్డారు. తెలంగాణలో బీసీలను ఎదగనీయకుండా చేసేందుకే బీజేపీ నేతలు కుట్ర పన్నారని కవిత ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
………………………………………