*హామీల అమలులో రేవంత్ సర్కారు విఫలం
*జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్
*యుగేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని
ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయాలని బిజెపి జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు గంటే ఉపేందర్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా చిల్పూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆదేశానుసారంగా చేపట్టిన నిరసన కార్యక్రమం తర్వాత పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కి అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్ యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేసే వరకు బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని గ్రామాలలో పేరుకపోయిన సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మండల జనరల్ సెక్రెటరీ వెలిశాల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కందుకూరి రాజనీకర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఉరడి రాజు, యువ మోర్చా అధ్యక్షులు తోట రంజిత్, శైలేష్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
