* బీజేపీ మేనిఫెస్టో విడుదల
* ప్రజలను ఆకట్టుకునేలా రూపకల్పన
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసింది. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కీలక అంశాలను అందులో పొందుపరిచారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్తంలో 27 మంది మేనిఫెస్టో రూపకల్పనలో ఉన్నారు. ప్రజల నుంచి దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు తీసుకుని మేనిఫెస్టోను రూపొందించినట్లు రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. పైపు లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ అందజేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు.
మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు
– వన్ నేషన్.. వన్ ఎలక్షన్
– స్వచ్ఛ భారత్.. సుస్థిర భారత్..
– దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
– సీనియర్ సిటిజెన్లతో పాటు ట్రాన్స్‌జెండర్లకూ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు
– 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక
– ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
– డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెంపు
– కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
– మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
– మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు
– ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
– సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం
– విశ్వబంధు
– క్రీడావికాసానికి ప్రాధాన్యం
– మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
——————-