* వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలకు బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు ఎడ్లబండిపై వచ్చారు. రైతులకు మద్దతు తెలిపారు. శాసన సభలో 317 జిఒ, ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపే అంశంపై బిజెపి ఎంఎల్ఎలు వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు బీఆర్ ఎస్(BRS) ఎమ్మెల్యేలు పచ్చకండువాలతో సభకు వచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీ, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని కోరుతూ తీర్మానం ఇచ్చారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలి. రూ.2 లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
…………………………………………………