Kamalapur BJP new committee formation
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన సంఘటనా సంరచనా పర్వం-2025 ప్రక్రియలో భాగంగా, జిల్లా అధ్యక్షుడు, జిల్లా సంరచనా ప్రభారీల ఏకాభిప్రాయంతో ఈ కమిటీని రూపొందించారు. ఈ నూతన మండల కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా జెట్టి సారంగపాణి, తుర్పాటి భాస్కర్, ఉపాధ్యక్షులుగా పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, ఏనుగుల రత్నాకర్, గోలా తిరుపతి, మోడెం సునీత నియమితులయ్యారు. కోశాధికారిగా చానుమల్ల సంజయ్ కుమార్ సహా మొత్తం 30 మందితో ఈ కార్యవర్గం ఏర్పాటయ్యింది.
అనుబంధ విభాగాలైన వివిధ మోర్చాల అధ్యక్షులుగా రావుల ఆకాష్ (యువమోర్చా), పెండ్యాల తిరుపతి రెడ్డి (కిసాన్ మోర్చా), సన్నపు పద్మ (మహిళా మోర్చా), బుర్రా కరుణాకర్ (OBC మోర్చా), ఎండి. రాజ్ మహ్మద్ (మైనారిటీ మోర్చా), మరియు జెర్రిపోతుల రాజేందర్ (ఎస్సీ మోర్చా) ఎంపికయ్యారు. ఈ నియామకాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విజయం అనంతరం, కమలాపూర్ మండలంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈ నూతన బృందం సిద్ధమైంది. ఈ నియామకాలతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని నాయకులు పేర్కొన్నారు.
