
– బైక్ ర్యాలీ, తాసిల్దార్ కి వినతి పత్రం
ఆకేరు న్యూస్, కమలాపూర్ : తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు కమలాపూర్ మండలంలోని సమస్యలపై మండల బీజేపీ అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి తో కలిసి పార్టీ శ్రేణులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరూపయోగంగా ఉన్నాయని, మండలంలోని అర్హులైన నిరుపేదలకు ఆ డబల్ బెడ్రూంలు వెంటనే కేటాయించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన బస్టాండ్ నిర్మాణం పూర్తిచేయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కమలాపూర్ నుండి పంగిడిపల్లి కి వెళ్లే దారిలో హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్ వాహనాల వల్ల రోడ్డు అధ్వానంగా మారిందని, రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి పంగిడి పల్లి గ్రామ ప్రజలు పడుతున్న బాధను వెంటనే తీర్చాలని అన్నారు. మండల వ్యాప్తంగా రైతు రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేయాలని, దళిత బందు 2వ విడత పూర్తి చేయాలని అన్నారు.మండల వ్యాప్తంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దారు సురేష్ కి వినతిపత్రం అందించారు. సమస్యలు తీర్చలేని పక్షంలో బిజెపి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రజా క్షేత్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎండగడుతామని అన్నారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
………………………………