
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలంతో పాటు ఉప్పల్, శనిగరం గ్రామాల్లో బిజెపి పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కమలాపూర్‌లో పార్టీ జెండాను బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఆవిర్బవా శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 2 పార్లమెంట్ సీట్ల తో ప్రస్థానం మొదలు పెట్టి ప్రపంచంలో శక్తి వంతమైన,అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని, భవిష్యత్తులో తెలంగాణ లొ బీజేపీ అధికారంలోకి రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.దేశంలో NDA కూటమితో 19 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుందని బీజేపీ తోనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వలిగే సాంబారావు, తోట సురేష్, భూపతి ప్రవీణ్,బండి కోటేశ్వర్,ఎలిమి మహాజన్, ఇనుగాల రత్నాకర్, కనుకుంట్ల అరవింద్, భోగి బిక్షపతి, తాడేం రాజేందర్ జెట్టి సారంగపాణి, పాక కుమారస్వామి,బండి సంపత్,తూర్పటి భాస్కర్, బండి వినయ్ సాగర్,డాక్టర్ సాంబయ్య,పోలోజు రాజేశం,సుందరయ్య,పోతిరెడ్డి శంకర్,దండ బోయిన శ్రీనివాస్, తూర్పాటి భాస్కర్,బండి సంపత్, రాణా ప్రతాప్,పిట్టల సతీష్, మెడిపెల్లి రాజు,బండారి సుధాకర్,జెట్టి సారంగపాణి,లక్ష్మీనారాయణ,రాజయ్య, మౌటం మొగిలి, కొండమీది బిక్షపతి, మార్గం చైతన్య,శనిగరం సంపత్,రామ్ శెట్టి రాజయ్య,ఒడ్డె వీరన్న, పుల్ల సంజీవ్, రావుల ఆకాష్,గుర్రం సురేష్,నరిగే ఓదెలు, చందర్ సింగ్,దండబోయినా శ్రీనివాస్, సముద్రాల మొగిలి, ఎగ్గొజు శ్రీనివాస్, అకినపెల్లి రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
………………………………………….