
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ఎట్టకేలకు ఖరారైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి(Lankala Deepakreddy) నే మళ్లీ అభ్యర్థిగా అధిష్ఠానం ఎంపిక చేసింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసినా బీజేపీ ఇంత వరకు ప్రకటించకపోవడంతో ఉత్కంఠ ఏర్పడింది. రేసులో వెనుకబడిపోతున్నామని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా అభ్యర్థి ఖరారు కావడంతో కమలదళం కదనానికి ప్లాన్ చేస్తోంది. గతంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దీపక్‌రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు మహిళా నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడినా.. వివిధ సమీకరణాల్ని బేరీజు వేసుకున్నాక దీపక్‌రెడ్డి పేరు ఫైనల్ చేశారు. నామినేషన్లకు ఈనెల 21 వరకూ గడువు ఉంది. దీంతో దీపక్ రెడ్డి నామినేషన్ కు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్(Naveen yadav), బీఆర్ ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత (Maganti Suneetha)ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారాన్ని ఇక ముమ్మరం చేయనున్నారు. అధిష్ఠానం టికెట్ ప్రకటించగానే కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
………………………………………