
* అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు
* శాంతియుతంగా జరుపుకోవాలి : డీజీపీ శివధర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేపు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని సంఘాలూ ఒకేతాటిపైకి వచ్చి బంద్ ఫర్ జస్టిస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రజలను కోరింది. బీసీ సంఘాల బంద్‌కు పలు పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.ఈక్రమంలో బీసీ బంద్ భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. రేపటి బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
……………………………………………..