
* ప్రజలు ఎవ్వరు కూడా ప్రాజెక్టులు, చెరువుల దగ్గరకు వెళ్ళవద్దు .
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: భారీ వర్షాల కారణంగా బొగత జలపాతాలను సందర్శకుల భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని, ప్రజలు ఎవ్వరు కూడా ప్రాజెక్టులు, చెరువుల దగ్గరకు వెళ్ళవద్దనీ, పర్యాటకులు పర్యటించకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇతర ప్రాంతాలు ముత్యందార , కొంగల, మామిడిలోద్ది , కృష్ణపురం జలపాతాలు మొదలైన వాటిని పర్యాటకుల భద్రతా కారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయడం జరిగిందని, ఈ జలపాతాలను సందర్శించడానికి అనుమతి లేదని, ఈ సూచనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించి, కేసు నమోదు చేయడం జరుగుతుందని వివరించారు . జలపాతాలను సందర్శించే తేదీలను తర్వాత ప్రకటిస్తామనీ ఆ ప్రకటనలో ఆయన తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్. 18004257109 ల్యాండ్ లైన్ నెంబర్ లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రజలు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
……………………………………….