
* ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) రాష్ట్రం గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. థోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 11 మంది జలసమాధి అయ్యారు. సిహాగావ్ గ్రామానికి చెందిన 15 మంది భక్తులు పృథ్వీ నాథ్ ఆలయానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి సరయూ నదిలో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు 15 మంది బయటకు తీశారు. 11 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు, తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
………………………………….