* కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
ఆకేరు న్యూస్, కొత్తగూడెం : కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం చోటుచేసుకుంది. రైల్వే పట్టాలపై బాంబు పడి ఉండడంతో తినే పదార్థం అనుకొని వీథి కుక్క బాంబును కొరికింది. కుక్క బాంబు కొరకడంతోనే బాంబు పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ప్రయాణికులు ఒక్క సారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అటూ ఇటూ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ లోకి బాంబు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
