
* మొక్కులు తీర్చుకున్న పీవీ సింధు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో విశేష భక్తి శ్రద్ధలతో ఆదివారం బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ వస్త్రధారణలో ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. పీవీ సింధు ఆలయానికి చేరుకోగానే కమిటీ సభ్యులు (Committee members) ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాల నినాదాల నడుమ ఆమెను ఆలయ ప్రాంగణంలోకి ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ, “2015 నుండి ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటూ బోనం సమర్పిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతోనే నా జీవితంలో ఎన్నో విజయాలు వచ్చాయి. ఈ భక్తి పర్వదినంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది,” అని తెలిపారు.
…………………………………………