
ఆకేరున్యూస్, హన్మకొండ: 10 రోజుల క్రితం హన్మకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఏజెంట్ అయిన చింతపండు కృష్ణ R/0 హైదరాబాద్ మెడిశెట్టి నరేష్, అలాగే ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సురేష్ హన్మకొండ వాస్తవ్యులను అరెస్ట్ చేసి వీరి నుండి రూ.1,58,000, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అయిన గట్టం వీరమణి కుమార్ ఏ పండు S/o రాయుడు, వయస్సు: 28సం.లు, కులం: కాపు, వృత్తి: గుమస్తా, R/o H.No .32-6-12, యల్లావారి వీది సినిమా రోడ్డు, కాకినాడ. పేరు చెప్పగా ఈరోజు ఇతనిని హన్మకొండ పద్మాక్షి కాలనీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతనిని విచారించగా ఇతను 2023లో గోవాకు వెళ్ళినప్పుడు యోగేష్ గుప్తా ఏ జోగేష్ గుప్తా R/O హైదరాబాద్ పరిచయం అయ్యాడని, ఇతను ఆన్లైన్ గేమ్ క్రికెట్ బెట్టింగ్ ఇట్టి యాప్లో క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఆన్లైన్ లో బెట్టింగ్ చేయమని చెప్పాడని వివరణ ఇచ్చాడు. అందులో వచ్చినా లాభంలో తనకు 9% వాటా ఇస్తానని చెప్పగా వీరమణి కుమార్ ఏ పండు ఒప్పుకోవడంతో యోగేష్ గుప్తా ఏ జోగేష్ గుప్తా వీరమణి కుమార్ ఏ పండుకు Radhe exchange యాప్ గురుంచి చెప్పి దీనికి సంబందించిన లింకు (సైటు) యొక్క User name మరియు password ఇచ్చినాడని, అలాగే వీరమణి కుమార్ ఏ పండుకు సంబందించిన అకౌంటు నెంబర్స్ ఇస్తే వచ్చిన డబ్బులలో 1% కమిషన్ ఇస్తాను అని చెప్పగా వీరమణి కుమార్ ఏ పండు, తన అకౌంటు నెంబర్ మరియు తన ఫ్రెండ్ అకౌంటు నెంబర్ ఇవ్వగా ఇట్టి అకౌంటు లలో 5 కోట్ల వరకు బెట్టింగ్ డబ్బులు రాగా ఇందులో 3 కోట్లు యోగేష్ గుప్తాఏ జోగేష్ గుప్తాకు సంబందించిన వివిద అకౌంటు లకు పంపిచ్చినాడని మిగతా రెండు కోట్ల లలో ఒక్క కోటి ఆట ఆడిన వారికి ఇవ్వగా వీరమణి కుమార్ ఏ పండు వద్ద కోటి రూపాయలు ఉండగా ఇందులో ఒక్క ప్లాట్ కాకినాడలో, రెండు వైన్ షాప్ కాకినాడలో తీసుకున్నాడని చెప్పినాడు ఈరోజు హన్మకొండకు రాగా ఇతని పట్టుకొని ఇతని నుండి ఈ క్రింది వాటిని స్వాదీనం చేసుకున్నాము.
నేరస్తుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు..
1) 1,50,000/- రూపాయల నగదు
2) 2- సెల్ ఫోన్లు
పరారీలో ఉన్న నేరస్తులు
1) కితిరి రంజీత్ R/0 హన్మకొండ (ఆటగాడు)
2) యోగేష్ గుప్తాఏ జోగేష్ గుప్తా R/0 హైదరాబాద్ (బుకీ).
……………………………………………