![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-32.jpg)
* మరీ అంత ఘోరమా అంటూ టీ.సర్కారుపై గుర్రు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మందుబాబులు ప్రధానంగా బీరు ప్రియులు (Beer Lovers)తెలంగాణ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. బీర్ల ధరలను 15శాతం వరకు పెంచుకోవచ్చని తెలుపుతూ ఫైల్ పై సంతకం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 15శాతం పెంపు చాలా ఘోరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి తెలంగాణ(Telangana)లో కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. పక్క రాష్ట్రాల్లో బీర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేసింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉంటే అది తెలంగాణకే మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తెలంగాణకు వచ్చి బీర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. కానీ ప్రభుత్వం ఆవిధంగా ఆలోచించకుండా.., వాళ్లు పెంచారు కాబట్టి ఇక్కడ కూడా పెంచుకోవచ్చని డీలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీర్ 15శాతం పెరగడం అంటే దీనికి అదనంగా వ్యాట్, ఎక్సైజ్ టాక్స్ వంటి పన్నులు కూడా కలుస్తాయి. ఇప్పటి వరకు 150 రూపాయలు ఉన్న లైట్ బీర్ ఇక నుంచి 180 రూపాయలు అవుతుంది. రూ. 160 ఉన్న స్ట్రాంగ్ బీర్ ధర (Strong Beer Price) నేటి నుంచి రూ. 200 అవుతుంది. బీర్ ధరలు మాత్రమే కాదు త్వరలోనే వైన్, విస్కీ వీటి ధరలు కూడా పెంచాలనుకుంటోంది ప్రభుత్వం.
………………………………………