* కన్న తల్లిపైనే అత్యాచారం…!!!
* ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇటీవల తెలంగాణ లోని జనగామ జిల్లా పిట్టలోని గూడెంలో జరిగిన అమానవీయ సంఘటన గురించి ఇంకా మరిచిపోక ముందే ఢిల్లీలో ఓ ఘటన జరిగింది. ఢిల్లీలో జరిగిన అమానుష ఘటన గురించి తలచుకుంటే విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమాలోని పాటు గుర్తుకు వస్తోంది. ఈ దుర్యోధన..దుశ్శాసన అనే పాటలో…మర్మస్థానం కాదది,, నీ జన్మస్థానం అనే చరణం ఉంటుంది… కానీ ఓ కామాంధుడు ఢిల్లీలో తనకు జన్మనిచ్చిన తల్లిపైనే అఘాత్యానకి పాల్పడ్డాడు.. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఢిల్లీలోని బాధితురాలు (65) ఢిల్లీ (Delhi) లోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో తన భర్త, కుమారుడు (నిందితుడు), 25 ఏళ్ల చిన్న కూతురుతో కలిసి నివసిస్తోంది. ఇటీవల ఈ కుటుంబం సౌదీ అరేబియాకు పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లింది. వారు అక్కడ ఉన్నప్పుడే నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వెంటనే తిరిగి రావాలని తన తల్లి ప్రవర్తన బాగా లేదని ఇతరులతో సంబందాలు పెట్టుకుందని తండ్రికి ఫోన్ చేశాడు. తన తల్లికి విడాకులు ఇవ్వాలని కోరాడు.
తల్లిపై అఘాయిత్యం
ఈ నేపద్యంలో ఆగస్టు 1 న సౌదీకి వెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి వచ్చారు. అప్పటి నుండి బాదితురాలి కొడుకు రాక్షసంగా, అమానుషంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు .తన తల్లిని ఒక గదిలో బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె పెద్ద కుమార్తె ఇంట్లో ఆశ్రయం పొందింది. ఆగస్టు 11న బాధితురాలు తిరిగి తన ఇంటికి వచ్చినా, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆగస్టు 14న మరోసారి తల్లిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. తన తల్లికి గతంలో ఉన్న సంబంధాలకే ఇది శిక్ష అని చెప్పి మళ్లీ అమానుషానికి పాల్పడ్డాడు.
ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు
ఇక భరించలేని స్థితిలో ఉన్న ఆ తల్లి తన చిన్న కుమార్తెకు జరిగిన విషయాలను తెలిపింది. ఆమె ఇచ్చిన ధైర్యంతో ఇద్దరూ కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘోర సంఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.
………………………………….
