
* ముహూర్తం ఖరారు.. ఏర్పాటుకు సకల ఏర్పాట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్వర్ణగోపురం ఏర్పాటుతో తేజోమయంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరో అపురూప ఘట్టం మొదలుకానుంది. త్వరలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8వ తేదీన తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 9న దివ్యవిమాన రథోత్సవం జరగనుంది. అలాగే బ్రహ్మోత్సవాల దృష్ట్యా కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చణ సేవను రద్దు (Sevas Cancel due to brahmotsavm)చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
……………………………..