
*దత్తగిరి పీఠాధిపతులు
ఆకేరు న్యూస్, ములుగు: సమ్మక్క సారక్క స్ఫూర్తి అందరికీ ఆదర్శం అని దత్తగిరి పీఠాధిపతి అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజులు అన్నారు.ఆయన బృందం మేడారం సందర్శించిన అమ్మవార్ల గద్దెలపై ఆదివాసి ఆచార సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా జాతరను పురస్కరించుకొని జాతర పరిసరాలలో ప్రభుత్వ ఏర్పాట్లు అభినందనీయం అన్నారు. మేడారం గ్రామంలోని సుప్రసిద్ధ సమ్మక్క–సారక్క దేవస్థానాన్ని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు, సనాతన ధర్మ సంరక్షకులు శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, మహామండలేశ్వర్ డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ, “సమ్మక్క సారక్క తల్లులు ధర్మం, ధైర్యం, త్యాగం యొక్క ప్రతీకలు. వారు చూపిన స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శనం చేస్తుంది. మనం ధర్మం కోసం, సమాజ మేలు కోసం నిబద్ధతతో ఉండాలి” అని పేర్కొన్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర ఉత్సవాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయమని అన్నారు. రాబోయే 2026 జనవరిలో జరగనున్న జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించడం పట్ల వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించారు.“ఆలయాలు మన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. వాటి పరిరక్షణ, అభివృద్ధి ప్రతి భక్తుడి బాధ్యత. సమ్మక్క సారక్కల స్ఫూర్తితో మన జీవితాన్ని ధర్మమార్గంలో నడిపితే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుంది” తెలిపారు.మొదట పీఠాధిపతుల కు దేవస్థాన అధికారులు వినయ్ కుమార్, మధుసూదన్ అర్చకులు పూర్ణకుంభంతో స్వామీజీలకు ఘన స్వాగతం పలికారు. స్వామీజీలు ఆలయ దర్శనం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
…………………………………………………