
* విచారణకు హాజరు కావాలని ఆదేశం
* ఆయనతో పాటు హరీశ్‌రావు, ఈటలకు కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (justice pc ghosh commission) నోటీసులు అందజేసింది. ఆయతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు అందజేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 6న హరీశ్‌రావు, 9న ఈటల హాజరు కావాలని కమిషన్ పేర్కొంది. కేసీఆర్ (Kcr) హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు హరీశ్‌రావు(Harishrao). ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ (Etala Rajender) ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఈ కమిషన్ ఏర్పాటైంది. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్ ఇలా అన్ని వివరాలనూ కమిషన్ ఆరా తీయనుంది.
…………………………………………………….