* పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలను నేడు రద్దు చేస్తున్నట్లు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మంజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపధ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన్నీరు సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
………………………………………….
